కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఈసా-మూసీ నదుల సంగమ స్థలంలో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు, 1948లో మహాత్ముని చితాభస్మాన్ని ఇక్కడే నిమజ్జనం చేశారని వివరించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయి చిహ్నంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
