వినుకొండ:
దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ వినుకొండలో వివిధ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయడం, కనీస వేతనాన్ని రూ. 35,000గా నిర్ణయించడం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా అమలు చేయడం, కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించడం తదితర డిమాండ్లతో ఈ సమ్మె చేపడుతున్నట్లు నాయకులు వెల్లడించారు. దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వర్కర్స్, ఇంజనీరింగ్ వర్కర్స్, ముఠా వర్కర్స్, హమాలి వర్కర్స్, సివిల్ సప్లై వర్కర్స్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బూదాల శ్రీనివాసరావు, కొప్పరపు మల్లికార్జున, సంపెంగల అబ్రహం రాజు, రాచపూడి ఏసుపదం, కంచర్ల కోటేశ్వరరావు, పచ్చిగొర్ల ఏసు, సాయి, నరసింహారావు తదితరులు హాజరయ్యారు. అలాగే ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రేవిళ్ల శ్రీనివాసరావు, ఎస్.కే. నాగూర్ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
