ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం –

Spread the love

ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం – ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను – బి.ఆర్.ఎస్.ఎల్. పి. విప్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద..

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బి.ఆర్.ఎస్.ఎల్. పి . విప్. కె.పీ. వివేకానంద్ నిత్యం తన నివాసంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన వివిధ సమస్యలు, వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్, పింఛన్లు, తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను శ్రద్ధగా విని, సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే, నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబ, సామాజిక, ధార్మిక మరియు వివిధ శుభకార్యాల ఆహ్వాన పత్రాలను ఎమ్మెల్యే కి అందజేశారు. వాటిని సంతోషంగా స్వీకరించిన ఎమ్మెల్యే , వీలైనంత వరకు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో కలిసి ఉంటానని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top