పాకల బీచ్ ఫెస్టివల్ కు తరలిరావాలని జిల్లా ప్రజలకు పిలుపు
ప్రకాశం జిల్లా.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల వద్ద ఈనెల 14 15 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఒంగోలులోని ఆయన కార్యక్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలోని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ నేషనల్ హైవే నుండి 6 కిలోమీటర్ల దూరంలో వున్న పాకల బీచ్ వద్ద ఈనెల 14,15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న బీచ్ ఫెస్టివల్ లో ప్రకాశం జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో తరలివచ్చి సముద్ర తీరాన అహ్లాదకరమైన వాతావరణంలో రెండు రోజులపాటు సంతోషంగా గడపాలని పిలుపునిచ్చారు.తీర ప్రాంతల అభివృద్ధిలో భాగంగా ప్రజలకు వినోదం,ఉల్లాసం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.
రెండు రోజులపాటు నిర్వహించబోయే బీచ్ ఫెస్టివల్ లో వాటర్ స్పోర్ట్స్,సంస్కృతిక కార్యక్రమాలు తో పాటు అనేక వినోద కార్యక్రమాలు ఉంటాయన్నారు.బీచ్ అందాలను తిలకించేందుకు హెలికాప్టర్ రైడ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జిల్లాలోని ప్రజలంతా ఈ వేడుకల్లో పాల్గొని బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమం ప్రైడ్ మీడియా ఈవెంట్స్ ద్వారా చేపడుతున్నామనిఅన్నారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా ఎస్పీ 500 మంది సిబ్బందితో రక్షణ కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారని,జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో, జిల్లా ఇన్చార్జి మంత్రులు,జిల్లా మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ఇన్చార్జిలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ప్రకాశం జిల్లా ప్రజలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని దామచర్ల సత్య కోరారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
