దామోదరం సంజీవయ్యగారి సేవలు చిరస్మరణీయం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం, అధికారులతో కలిసి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దామోదరం సంజీవయ్య నిరాడంబరత, నిజాయితీ, కార్య దక్షత నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రమాదేవి, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
