విద్యుత్ వినియోగదారుల
న్యాయ సదస్సు.
21-02-26 శనివారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక , విజయవాడ వారి ఆధ్వర్యములో చిలకలూరిపేట డివిజన్ పరిధిలో వున్న డోకిపర్రు, ఫిరంగిపురం , ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, చిలకలూరిపేట టౌన్1,టౌన్ 2, రూరల్, గణపవరము, ఎడ్లపాడు సెక్షన్ లకు సంభందించిన విద్యుత్ సమస్యలకు తక్షణ పరిష్కారము కోరకు మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో సత్తెనపల్లి రోడ్డులో పేరేచర్ల సెంటర్ నందు గల శ్రీ సాయి కృష్ణ కళ్యాణ మండపం నందు ఉదయం 10.30గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్ న్యాయసదస్సు నిర్వహించబడుతుంది.
ఈ సదస్సు కార్యక్రమమునకు అధ్యక్షులు , యన్. విక్టర్ ఇమ్మానియెలు , విశ్రాంత జిల్లా న్యాయమూర్తి, సాంకేతిక సభ్యులు డి.కృష్ణ నాయక్ ,B. Tech,MBA , ఆర్థిక సభ్యులు కె .కృష్ణ ,Bcom.స్వతంత్ర్య సభ్యురాలు ఏ. సునీత ,M A ML, CRDA సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ M. శ్రీనివాస రావు ,M.tech పాల్గొంటారని ఆ సదస్సులో పరిష్కారం కాని విద్యుత్ సమస్యలు, విద్యుత్ అంతరయాలు, హెచ్చు తగ్గులు, మీటర్ సమస్యలు, బిల్లింగ్, విద్యుత్ సరఫరా కు సంబందించి న అన్నిరకాల సమస్యలు ఏదైనా వున్న యెడల వ్రాతపూర్వకంగా ఇచ్చిన యెడలసత్వరమేపరిష్కరించబడునని చిలకలూరిపేట డివిజన్ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వై. ఏడుకొండలు తెలిపారు కావున పైన తెలిపిన 9సెక్షన్లోని విద్యుత్ వినియోగదారులు పాల్గొని పరిష్కారం కాని తమ విద్యుత్ సమస్యలు తక్షణమే పరిష్కరించు కోవాలని ఆయన తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
