దివ్యంగులకు ప్రభుత్వము పలు సంక్షేమ పథకాలు అమలు………….. ఎమ్మెల్యే పూడి మెగా రెడ్డి
వనపర్తి
దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు.
వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీలో భాగంగా 40 ఉచిత త్రిచక్ర స్కూటీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి హాజరై లబ్ధిదారులకు స్కూటీలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వయం ఉపాధి, విద్య, ఉపాధి అవకాశాల కోసం రవాణా సౌకర్యం చాలా అవసరమని, ఈ త్రిచక్ర స్కూటీలు వారికి రోజువారీ జీవనంలో పెద్ద ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ వాహనాలను జాగ్రత్తగా వినియోగించుకొని స్వావలంబన సాధించాలని సూచించారు.
ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలో ముందంజలో ఉందని తెలిపారు. సమాజంలో వారు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేందుకు ఈ విధమైన కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. అవసరమైన వారికి మరిన్ని సౌకర్యాలు అందించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే అర్హులైన దివ్యాంగులకు 40 త్రి చక్ర స్కూటీలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ప్రజాప్రతినిధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
