విజయ డైరీ డైరెక్టర్ గోళ్ళ సుధాకర్ అమ్మ కి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
విజయ డైరీ డైరెక్టర్ గోళ్ళ సుధాకర్, టిడిపి నాయకులు గోళ్ళ సుదర్శన్ మాతృమూర్తి గోళ్ళ నాగమ్మ స్వర్గస్థులైన వార్త తెలిసి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బుచ్చిరెడ్డి పాళెం దామరమడుగులోని వారి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాగమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరామర్శించిన వారిలో మండల పార్టీ అధ్యక్షులు బెజవాడ జగదీష్, దామరమడుగు గ్రామ పార్టీ అధ్యక్ష, కార్యదర్సులు శేషుకుమార్, మస్తాన్, చేనేత సంఘ నాయకులు కెవి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
