రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం అండ….
ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేసిన కలెక్టర్…
కర్ల రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో చేయూత అందిస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ హామీ ఇచ్చారు. రాజేష్ తల్లి లలితమ్మను కలెక్టర్ కోదాడలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రం కూడా సిద్ధమైందని, మరో రెండు మూడు రోజుల్లోనే లలితమ్మకు నియామక పత్రాన్ని కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం నుంచి అన్ని రకాల బెనిఫిట్స్ ను ఆ కుటుంబానికి వర్తింపజేసి, అన్ని విధాలా అండగా ఉంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఆర్డిఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి,జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి, తహసిల్దార్ వాజీద్ అలీ,యాతాకుల రాజన్న మాదిగ,ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు,
ఏపూరి రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా కన్వీనర్, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు, ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగ, ములకలపల్లి రవి మాదిగ, పిడమర్తి చిన్న వెంకట్రావు, లంజపల్లి శ్రీను, ఆకారపు కొండలు, కొండపల్లి సూర్యప్రకాష్, బొడ్డు కుటుంబరావు, సిరి పంగి లింగస్వామి, ఎమ్మార్పీఎస్ పట్టణ నాయకులు కర్ల శివ, కర్ల కమల్, పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
