ఎన్నా చెరువు” కంచె నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
స్థానిక కాలనీవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేలా చెరువును సుందరీకరించాలని అధికారులకు ఆదేశం…
132 – జీడిమెట్ల డివిజన్ “ఎన్నా చెరువు” కంచే నిర్మాణ పనులను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశీలించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. చెరువు పైవున్న రోడ్డును స్థానిక కాలనీ వాసులకు
ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసి, రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను పక్కకు మార్చి కంచె నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
చెరువులో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు కలవకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చర్యలను చేపట్టి ఎన్నా చెరువులో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసే విధంగా చెరువును సుందరీకరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ రామకృష్ణ, డిఈ వీరారెడ్డి, ఏఈఈ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
