విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందించిన ఎంపీ విపిఆర్
నడవలేని దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించిన ట్రై సైకిల్స్ అందజేత నిర్విఘ్నంగా సాగుతోంది. విపిఆర్ నివాసంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ పరిధిలోని కొండాయపాలెం గేట్ సమీపంలో నివసించే శ్రీనాథ్ అనే దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ అందజేశారు. తాను నడవలేనని, ఏ పని చేసుకోలేనని ట్రై సైకిల్ ఇచ్చి ఆదుకోవాలని ఆదివారం విపిఆర్ ను శ్రీనాథ్ కలిశారు. అనుకున్నదే తడవుగా దివ్యాంగుడికి సోమవారం ట్రై సైకిల్ ఏర్పాటు చేయించారు. ఆత్మ విశ్వాసానికి వైకల్యము అడ్డుకాదని వారు పేర్కొన్నారు. దివ్యాంగులు ట్రై సైకిల్స్ ద్వారా తమ జీవితాన్ని ప్రభావవంతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
