గుంటూరు
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసిన దొంగల అరెస్టు…
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్
చింతలపూడి గ్రామంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి నివాసం ఉంటున్నారు…
ఈనెల 16వ తారీకు తాళం వేసి ఉన్న ప్రమీల దేవి నివాసం ఉంటున్న ఇంటిలోకి దొంగలు ప్రవేశించి బీరువాను పగలకొట్టి 10 కేజీల వెండి లక్ష రూపాయల నగదు 42 సవర్ల బంగారాన్ని అపహరించారు…
ప్రమీల దేవి ఇల్లు ముందుగానే రెక్కీ నిర్వహించి సత్తెనపల్లి రాకేష్ (25) మరియు కొక్కిలిగడ్డ ఆశీర్వాదం (31) ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు …వీరు పై గతంలో 34 కేసు లు ఉన్నాయి…
చోరీ కాబడిన వస్తువుల విలువ సుమారు 69 లక్షల 25000/- ఉంటుందని వెల్లడి…
వేలిముద్రలు మరియు సిసి ఫుటేజ్ ఆధారంగా కేసులు చేదించాం…
ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను గుర్తించాం వీరిలో ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశాం…
చీరాలలో దొంగిలించిన కారులో నిందితులు వచ్చి ఈ దొంగతనానికి పాల్పడ్డారు…
నిందితుల వద్ద నుండి 42 సవర్ల బంగారాన్ని, వెండి ఆభరణాలను,లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నాం…
నిందితులు ఉపయోగించిన డ్యూక్ ద్విచక్ర వాహనాన్ని మరియు దొంగతనానికి ఉపయోగించిన టాటా ఇండికా కారుని సీజ్ చేశాం.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
