“అరైవ్–అలైవ్” రెండో విడతలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు….

Spread the love

అరైవ్–అలైవ్” రెండో విడతలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు….

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం…

-పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…

పెద్దపల్లి / రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో “అరైవ్–అలైవ్” రెండో విడత కార్యక్రమంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రతి వాహనదారుడు సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడం ప్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదని,ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు.సురక్షిత ప్రయాణం ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్,ఏసీపీ ప్రకాష్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,సీఐ ప్రమోద్ రావు,ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top