మౌనిక హంతకులను కఠినంగా శిక్షించాలి.
జగతగిరిగుట్ట లో కోవత్తుల ర్యాలీ.
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో మల్లన్న జాతర లో చాకలి కుటుంబానికి చెందిన వారు గుడిలో కి వచ్చి ఇచ్చిన డబ్బులకు రసీదు అడిగితే మమ్మలనే అడుగుతారా అని చెప్పి దాడి చేసి 2 నెలల పాపం మౌనిక మరణానికి కారణమయ్యారని,దానికి కారణమైన ముఖ్యమైన వారిని నేటి వరకు అరెస్ట్ చెయ్యకపోవడం దారుణమని అన్నారు. కుల దూరహంకారం తో రెచ్చిపోవడం అనగరికమని,రేవంత్ రెడ్డి బీసీ బంధువు అని చెప్పి ప్రగల్బాలు పల్కడం తప్ప నిజాం కాదని దానిని నిరూపించుకోవాలంటే వెంటనే అరెస్ట్ చేసి జైలు కు పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి రజక సంఘం నాయకులు విట్టల్ నాయకత్వం వహించగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,సీనియర్ నాయకులు ఏసురత్నం,రజక సంఘం నాయకులు భాస్కర్,నాగరాజు,చంద్రిమౌళి,సత్యనారాయణ,రాజు,శ్రీనివాస్ సతీష్ మండల సహాయ కార్యదర్శులు హరినాథ్,రాములు,ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు లు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
