శంషిగూడ డివిజన్ పరిధిలోని దత్తాత్రయ కాలనీ ఫేస్ 2

Spread the love

శంషిగూడ డివిజన్ పరిధిలోని దత్తాత్రయ కాలనీ ఫేస్ 2 లో జరిగిన కాలనీ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా గెలుపొందిన ఎ. భాస్కర్ కాలనీ వాసులతో కలిసి శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ ని, డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడుకి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ కమిటీ ని ఏర్పాటుచేసుకుని కార్యవర్గ సభ్యులందరు సమిష్టిగా కలిసి పనిచేస్తూ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జగదీష్, నిరంజన్ గౌడ్, సత్యనారాయణ, రాంచందర్, ప్రభాకర్, వేణు, పల్లి రాజు, సాంబశివరావు, దాస్, వాసు, శ్రీను, MD జాహిరుద్దీన్, వెంకటస్వామి, కుమార్, సంతోష్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top