యువత ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు …..
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
సాక్షిత పెద్దపల్లి // మంథని,
యువత ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. మంథనిలోని గంగపురి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని, గౌతమి నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను, టాస్క్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రభుత్వ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ లో భాగంగా టీజిఐఐసి సంస్థ ఆధ్వర్యంలో గార్మెట్ యూనిట్ల ఏర్పాటు చేసేందుకు వీలుగా 2 ఎకరాలు కేటాయించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టాస్క్ సెంటర్ ద్వారా యువత మంచి శిక్షణ అందించేందుకు వీలుగా మంథని లో సెంటర్ ఏర్పాటు చేశామని, అవసరమైన పక్షంలో మరో భవనానికి కూడా విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
అనంతరం పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో నిర్మిస్తున్న స్త్రీ భవనం పనులను కలెక్టర్ పరిశీలించి పెండింగ్ ఉన్న చిన్న చిన్న పనులు పూర్తిచేసి మార్చి 31 నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని ఆర్డీవో సురేష్, తహసిల్దార్ ఆరిఫోద్దీన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
