మహాలక్ష్మీ అమ్మవారి ఆలయానికి విచ్చేసి పరిశీలించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నవాబుపేటలో ఉన్న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని నవాబ్‌పేటలో ఉన్న ఆర్యవైశ్య మహాలక్ష్మీ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం పునః నిర్మాణంపై కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయాన్ని భక్తుల సహకారంతో పునః నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. 2024 ఏప్రిల్ లో ఆలయ పునః నిర్మాణ పనులు మొదలు పెట్టారని, కొనసాగుతున్నాయన్నారు.
ఇంత మంచి ఆలయాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో టిటిడి దృష్టిలో పెడితే తప్పకుండా తగిన సహాయం అందుతుందని సూచించారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆశీసులతో పనులు త్వరగా పూర్తయి భక్తులకు ఆలయం అందుబాటులోకి రావాలని, అమ్మవారి దీవెనలు ప్రజలపై ఉండాలన్నారు. అంతకుముందు ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నుడా మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, ఆలయ కమిటీ అధ్యక్షులు సుదర్శన్, టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్‌రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, గుడి హరిరెడ్డి, సాయిరాం సుధాకర్, ఆర్యవైశ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
