కోదాడ15వ వార్డులో దోమల మందు పిచికారీ

Spread the love

కోదాడ15వ వార్డులో దోమల మందు పిచికారీ……* పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి….
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు…*

కోదాడ రంజాన్ పండుగను పురస్కరించుకుని కోదాడ మున్సిపాలిటీలోని 15వ వార్డులో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, స్థానిక కౌన్సిలర్ షేక్ షఫీతో కలిసి వార్డులో పర్యటించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వార్డులోని గల్లీ గల్లీలో ఫాగింగ్ (దోమల మందు పిచికారీ) చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో రంజాన్ పండుగ సమీపిస్తున్న తరుణంలో మసీదుల పరిసరాల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఖాజా, మసీదు మౌజాన్ నాజిం పాషా,వార్డు ఆఫీసర్ శివ, జవాన్ బాబురావు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top