రాయినిగూడెంలో కాంగ్రెస్ కొత్త జోష్… 11వ వార్డు కమిటీ ఎన్నిక
వార్డు అధ్యక్షుడిగా నంధ్యాల మహేష్ రెడ్డి ఏకగ్రీవం
సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు (రాయినిగూడెం)లో నూతన కమిటీని ఘనంగా ఎన్నుకుంది. పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేపట్టిన ఈ నియామకాలు స్థానికంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. వార్డు అధ్యక్షుడిగా నంధ్యాల మహేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా నామ సతీష్, ఎల్గూరి సిద్దుగౌడ్ బాధ్యతలు చేపట్టారు. యువతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ సంధన బోయిన మణి కుమార్ను యూత్ అధ్యక్షుడిగా ఎంపిక చేయగా, యూత్ ఉపాధ్యక్షులుగా సింగం నవీన్, గంగరబోయిన నగేష్ నియమితులయ్యారు. ఈ కమిటీ ఎన్నికల ప్రక్రియలో ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, కొప్పుల వేణ రెడ్డి, పోతు బాస్కర్, మున్సిపల్ చైర్మన్ మోరిశెట్టి నివేదిత లక్ష్యాధి, వైస్ చైర్మన్ షఫీ వుల్లా, అంజాద్ అలీ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరియు 11వ వార్డు మాజీ కౌన్సిలర్ మరియు వార్డు ఇన్చార్గ్ ఎడ్ల గంగా భవాని వీరమల్లు యాదవ్ తదితర నాయకులు సమన్వయంతో సహకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా వార్డు అధ్యక్షుడు నంధ్యాల మహేష్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ ఉన్నత నాయకత్వానికి, సహకరించిన నాయకులకు మరియు వార్డు కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “పార్టీ సిద్ధాంతాలపై విశ్వాసంతో, వార్డు ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తాం. రాయినిగూడెంలో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం. యువత, మహిళలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా, పార్టీ కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ నియామకాలతో రాయినిగూడెం వార్డులో కాంగ్రెస్ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకోనున్నాయని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
