ఆంధ్రప్రదేశ్ లో ఆడ పడుచుల పెద్దన్న చంద్రన్న
శాసనసభ సమావేశాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ఒక సమాజం యొక్క అభివృద్ధి అనేది అక్కడ మహిళలు ఎంత గౌరవంగా భద్రంగా జీవిస్తున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుందని ఆ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొనియాడారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం 20 నెలల స్వల్ప కాలంలోనే మహిళా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడటం యాదృచ్ఛికం కాదని ఇది మహిళల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమ, గౌరవం మరియు బాధ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళలకు అండగా నిలిచే ఒక పెద్దన్నలా చంద్రన్న నిలబడ్డారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అసెంబ్లీలో భావోద్వేగ ప్రసంగం చేశారు.
పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పి4 పథకం ద్వారా 10 లక్షల బంగారు కుటుంబాలకు 50 వేల నుండి 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, డ్వాక్రా మహిళల రుణ పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఆమె సభలో గణాంకలతో సహా తెలిపారు. సమాజంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో వారికి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారని ఆమె గుర్తు చేశారు. తల్లి విలువ తెలిసిన నాయకుడిగా తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 10 వేల కోట్లను నేరుగా జమ చేసి ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రశంసించారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
