శిల్పకళా వేదికలో మాదిగ కో ఆర్డినేషన్ ఎంప్లాయిస్ కమిటీ ఏర్పాటు

Spread the love

హైదరాబాద్: శిల్పకళా వేదికలో మాదిగ కో ఆర్డినేషన్ ఎంప్లాయిస్ కమిటీ ఏర్పాటు చేసిన అభినందన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ,మంత్రులు దామోదర రాజనర్సింహ , అడ్లూరు లక్ష్మణ్ ,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి ,వేముల వీరేశం ,ప్రొఫెసర్ ఖాసీం తో కలిసి పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య .

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ
ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో గడచిన 20 ఏళ్లుగా నాకు చేతనైన సాయం చేస్తూ వచ్చాను. మాదిగల తరపున కొట్లాడటంలో నాకు కర్ణుడు ఆదర్శం. గత పాలకులు ఈ విషయంలో నన్ను శాసన సభ నుండి బయటకు ఈడ్చేసినా పోరాటం ఆపలేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. ఇది నాకు జీవితాంతం తృప్తిని ఇచ్చే అంశం. పేదలకు నేను న్యాయం చేసే క్రమంలో కొన్ని శక్తులు వెనుకనుంచి దాడులు చేస్తాయి. ఆ సందర్భంలో రక్షణగా ఉండాలని మాదిగ సోదరులను కోరుతున్నా. వర్గీకరణతోనే అన్నీ సమస్యలు పరిష్కారం ఐపోవు. ప్రతి సమస్య పరిష్కరించి ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు అనుక్షణం శ్రమిస్తా, అండగా ఉండండి.అని ముఖ్యమంత్రి తెలిపారు

You cannot copy content of this page

Scroll to Top