యడ్లపాడు స్పిన్నింగ్ మిల్లుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు
యడ్లపాడు,:జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ స్థాయిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ముఖ్యంగా యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 స్పిన్నింగ్ మిల్లులపై పోలీసులు ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ కోసం ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలో పోలీసులు 12 ప్రత్యేక బృందాలుగా విడిపోయి మిల్లుల్లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తనిఖీల అనంతరం, మిల్లుల్లో పనిచేసే కార్మికులకు డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. యువత మరియు కార్మికులు వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా సూచించారు. మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ, కార్మికులందరితో మత్తు పదార్థాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. అనుమానిత వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
