శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మరియు అభయాంజనేయ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ …..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ లోని (ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ) లో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సహిత కామాక్షి సమేత, పశుపతి నాథ శ్రీ విజయ గణపతి అభయాంజనేయ దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ నాయకుడు** కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ఆ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు….
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు మరియు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు….
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ని శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు….
ఈ కార్యక్రమంలో ఎరువ వెంకటరమణ, శ్రీనివాస్ రెడ్డి రామచందర్రావు, జగన్, ప్రేమ్ కుమార్ ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు….

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
