అంకాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం
తిరుపతి: తిరుపతిలోని అంకాలమ్మ దేవాలయ పాలకమండలి చైర్మన్, సభ్యుల చేత తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ల సమక్షంలో ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం దేవాలయ పాలకమండలి అధ్యక్షులు మోహన్ రాయల్, సభ్యులు దస్తగిరితో పాటు జనసేనని వీర మహిళ భాగవతుల జయలక్ష్మిని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు, బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అండ్ రాయలసీమ రంగస్థల కళాకారుల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిలు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
వారితో పాటు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, బిజెపి నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, పడమర మండల అధ్యక్షుడు శ్రీధర్, తూర్పు మండల అధ్యక్షుడు ఆదం అనిల్ రెడ్డి, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు హరి నాయుడు, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవి ప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ఆర్ కుమార్ తదితరులు సభ్యుల్ని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి సమన్యాయాన్ని పాటిస్తూ…అన్ని వర్గాల వారికి ముఖ్యంగా మహిళలకు, బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తలపుట్టపు బుచ్చి రాంప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పాలకమండలి సభ్యులు అందరూ కూడా తిరుపతిలో ప్రఖ్యాతి గాంచిన పురాతన ఆలయమైన అంకాలమ్మ దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
