చిచ్చర పిడుగు ‘అయాన్ష్’ ఒకే రోజు రెండు మెడల్స్ సాధించిన కరాటే కిడ్…
పెద్దపల్లి / గోదావరిఖని తిలక్ నగర్ డౌన్ కు చెందిన రాకం శ్వేత-కిరణ్ కుమారుడు కరాటే కిడ్ అయాన్ష్(8) ఆదివారం జరిగిన 5వ. రాష్ట్రస్థాయి ఓపెన్ ఇన్ ఆల్ స్టైల్ కుంగ్ ఫూ, కరాటే చాంపియన్ షిప్-2026, అంతర్ రాష్ట్రీయ కరాటే చాంపియన్ షిప్ -2026 టోర్నమెంట్స్ లో పాల్గొని ఒకే రోజు రెండు మెడల్స్ సాధించాడు.
స్థానిక చంద్రశేఖర్ నగర్ లోని గుడ్ మార్నింగ్ గ్రామర్ స్కూల్ లో 3వ తరగతి చదువుతున్న ఈ సూపర్ కిడ్ డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ మాస్టర్ పి.చందు వద్ద కరాటేలో గత 5నెలలుగా శిక్షణ పొందుతున్నాడు. అయాన్ష్ పాల్గొన్న మొదటి టోర్నమెంట్స్ ఇవే కాగా.. ఒకే రోజు వేర్వేరు చోట్ల జరిగిన రెండు టోర్నమెంట్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచి రెండు మెడల్స్, సర్టిఫికెట్లు అందుకున్నాడు.
ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో డ్రాగన్ స్వోర్డ్ కుంగ్ ఫూ అకాడెమీ నిర్వహించిన టోర్నమెంట్ లో కటాస్ విభాగంలో రజత పతకం సాధించగా, మంచిర్యాల జిల్లా రామకృష్ణా పూర్ లో జెన్ షిటో ర్యూ కరాటే స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్ లో ప్రతిభ కనబరిచి కాంస్య పతకం అందుకున్నాడు.
కాగా 8సంవత్సరాల వయసులోనే అత్యంత ప్రతిభ కనబరిచిన ఈ చిన్నారి భవిష్యత్ లో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు అందుకోవాలని మాస్టర్ చందు, తల్లిదండ్రులు శ్వేత-కిరణ్ ఆకాంక్షించారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
