నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం
44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి
విజయవాడ, స్థానిక 44వ డివిజన్ లోని నాలుగు స్తంభాల సెంటర్ వాణి బడ్డీ కొట్టు సందులో ఏడు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా మెట్లు, డ్రైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి చెప్పారు. నూతన పనులకు కార్పొరేటర్ రత్నకుమారి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి మార్గదర్శకత్వంలో 44 డివిజన్ లో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు.
డివిజన్ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తాము పని చేస్తున్నట్లు ఆమె వివరించారు. 44వ డివిజన్ తెలుగుదేశం నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ఎంపీ కేశినేని శివనాధ్, పశ్చిమ ఎమ్మెల్యే వై.సుజనా చౌదరి అహర్నిశం కృషి చేస్తున్నారని కొనియాడారు. 44వ డివిజన్ లోని కొండ ప్రాంతంలో అవసరమైన ప్రాంతాల్లో మెట్లు, డ్రైన్లు నిర్మాణం పనులు నిర్వహిస్తున్నామని, అలాగే అవసరమైన చోట్ల సంబంధిత పనులకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏఈ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్యూనిటీ సెక్రటరీ హర్షిత, కాంట్రాక్టర్ బత్తుల వెంకటేష్, స్థానికులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
