లేగుంటపాడు అనే చిన్న గ్రామం, వేములపాటి అజయ్ పిలుపుతో ఒకే సిట్టింగ్లో 200 మంది ఉద్యమి సభ్యులుగా నమోదు కావడం జనసేన ఉద్యమానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది.
పవన్ కళ్యాణ్ ఆలోచనలకు మద్దతుగా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు… ఆయన సిద్ధాంతాల కోసం, సమాజానికి మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తారని లేగుంటపాడు గ్రామం నిరూపించింది.
ఎవరైనా ఇన్సూరెన్స్ కోసం కాదు… పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం నిలబడితే చాలు అనే భావంతో 200 మంది ఒకేసారి ఉద్యమి సభ్యులుగా చేరడం జనసేనకు బలమైన సంకేతం.
వేములపాటి అజయ్ పిలుపుతో కోవూరు నియోజకవర్గంలోని లేగుంటపాడు గ్రామంలో ఒకేసారి 200 మంది జనసేన ఉద్యమి సభ్యత్వం నమోదు చేసుకోవడం ఆ ప్రాంతంలో పార్టీకి పెరుగుతున్న ప్రజాభిమానాన్ని స్పష్టంగా చూపించింది.
ఈ సందర్భంగా ఏపి టిడ్కో చైర్మన్,జనసేన జాతీయ మీడియా ప్రతినిది,వేములపాటి అజయ్ గారు మాట్లాడుతూ… గ్రామంలో తన మిత్రులతో ఉన్న ఆప్యాయ అనుబంధాన్ని పంచుకుంటూ,తన మిత్రులు అజాతశత్రువు కీర్తిశేషులు తులసిరెడ్డి కి అజయ్ ఘనంగా నివాళులు అర్పించారు.
స్థానిక ప్రజలు తమ గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై అధికారులతో చర్చించి సత్వర పరిష్కార మార్గాలు చూపిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
అలాగే చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు గ్రామపంచాయతీలలో అభివృద్ధి వెలుగులు నింపుతూ గ్రామస్వరాజ్యం లక్ష్యంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కూడా వారితో ఉద్యమి మశనమోదు లో పాల్గొని గ్రామ ప్రజలను ఉత్సాహపరిచారు. గ్రామ ప్రజల ఆప్యాయత, కార్యకర్తల సమిష్టి సహకారం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ మీడియా జనసేన ప్రతినిధి వేములపాటి అజయ్ తో పాటు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల,సీనియర్ నాయకులు,నూనె మల్లికార్జున పప్పు నారాయణ,కృష్ణారెడ్డి,రవి, కోవూరు నియోజకవర్గపు నాయకులు నక్కల శివకృష్ణ,జీవన్,సురేష్, ఆత్మకూరు నియోజకవర్గం నాయకులు చదరవాడ హరీష్ మరియు మృదుల దంపతులు వీర మహిళలు నందిని, గజరాజు శాంతి కల,పవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
