వ్యాధి వచ్చాక చికిత్స కన్నా.. నివారణే మేలు…
నెల్లూరుజిల్లా ఇనమడుగు పి హెచ్ సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు డా.నిరంజన్ బాబు తో కలిసి కోవూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి HPV వ్యాక్సిన్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి,డా. నిరంజన్ గ మాట్లాడుతూ..14 ఏళ్లు పూర్తయిన ఆడ పిల్లలందరూ HPV వ్యాక్సినేషన్ చేయించుకోవాలి.గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు ముందస్తుగా ‘గార్డసిల్ 4’ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవాలి.మార్చి 11వ తేదీ నుండి మూడు నెలల పాటు అన్ని ప్రభుత్వ పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్యాల కేంద్రాల నందు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వ్యాక్సినేషన్ జరుగుతుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో.యస్. కె.సుభాన్ కోవూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, డా.ఇర్ఫాన్,CHO.ప్రభావతి PHN.కృష్ణయ్య, HV. విజయమ్మ, HS.ఇలియాస్, ఏఎన్ఎంలు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
