పేద ప్రజల గుండె చప్పుడే వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
కూటమి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమం శూన్యం
ప్రజా నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
వై యస్ ఆర్ కాంగ్రెస్ 16 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట 6 మైల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విచ్చేసి డా.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ.. వై.యస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 వ సంవత్సరంలో అడుగు పెట్టాము. ప్రజలు నాయకులు కార్యకర్తలు మానస పుత్రిక వై.యస్.ఆర్ పార్టీ స్థాపించిన తర్వాత రాష్ట్రంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చాక భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని 33 పథకాలు పెట్టి యస్.సిలు యస్.టిలు, బీసీలు, ముస్లిం మైనార్టీలకు సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండింది.
ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో పేద ప్రజలను నిర్లక్ష్యం చేశారు. అభివృద్ధి సంక్షేమం శూన్యం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్ని వర్గాల వారు చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయిపోయాయి రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరగడం ప్రజలను పూర్తిగా వదిలేశారు.వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల గుండెల్లో నుంచి వచ్చింది ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాం.. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వీరి చలపతిరావు, మావులూరు శ్రీనివాసులురెడ్డి, గొల్లపల్లి విజయ్ కుమార్, బట్టేపాటి నరేంద్ర రెడ్డి, కొండూరు అనిల్ బాబు, కలువ బాల శంకర్ రెడ్డి, మరియు వై.యస్.ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
