పిఎంపి, డయాడాడ్ ఫౌండేషన్ సేవలు ఎంతో అభినందనీయం
“పరీక్షల సమయంలో భయానికి గురి కావొద్దు.”
‘పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ.’
దూడల వెంకయ్య,
మాజీ విఆర్ఓ.
బుజబుజ నెల్లూరు లోని డి.వి.ఎన్.యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శుక్రవారం, డయాడాట్ ఫౌండేషన్ మరియు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, షాప్నర్లు, హాల్ టికెట్ భద్రపరిచే బ్రోచర్స్, లాంగ్ స్కేల్ మరియు పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ విఆర్ఓ, పాఠశాల వ్యవస్థాపకులు దూడల వెంకయ్య మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షా కాలంలో ఎలాంటి భయానికి లోను కావద్దని అన్నారు. ఈ సందర్భంగా పరీక్షలకు అవసరమైనటువంటి విద్యా సామాగ్రిని అందజేసిన డయాడాట్ ఫౌండేషన్, పీఎంపీల సేవలు ఎంతో అభినందనమని కొనియాడారు.
పదవ తరగతి విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని, ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని, ఒత్తిడికి గురికాకుండా ముందడుగు వేయాలని, సమయపాలన చాలా ముఖ్యమని, పరీక్షా సమయంలో కాలక్షేపానికి తావు ఇవ్వకూడదని, ప్రధానంగా స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలతో గడపడం, కబుర్లు, షికార్లు, బైక్ రైడింగ్ లు, ముఖ్యంగా సినిమాలకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు కూడా ఇంట్లో చదువుకునే వాతావరణం కల్పించాలని, రాత్రి సమయంలో బలవంతంగా చదవడం వల్ల మెదడుకు చేరకపోగా అనారోగ్యానికి దారితీస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వెంకటరమణ, పాఠశాల వ్యవస్థాపకులు దూడల ప్రసాద్ రావు, నగళ్ళ రాము, పి.హెచ్. జిల్లా అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్, దేవరకొండ శ్రీనివాసులు, డయాడాట్ పౌండేషన్ నాయకులు విలియం ఆంటోనీరాజా, చెన్నకేశవ, మీరా మొహిద్దిన్, ఆశిక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
