రంజాన్ పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న “ఈద్ కా తోఫా” (రంజాన్ కానుక) పథకం పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మరియు బహదూర్ పల్లి మసీదులల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి హాజరై మసీదుల ద్వారా అర్హులైన ముస్లిం కుటుంబాలకు ఈద్ కా తోఫాలు (దుస్తులు మరియు ఇతర నిత్యావసర వస్తువులు) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, రంజాన్ పండుగ సోదరభావం, సహనం మరియు సేవా భావానికి ప్రతీక ,పేద మరియు అవసరమైన కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈద్ కా తోఫా పథకం వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరారు .
ఈ కార్యక్రమంలో కొంపల్లి అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, లేబర్ సెల్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మైసి గారి శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ గోపాల్ రెడ్డి, ఆదిరెడ్డి మోహన్ రెడ్డి, మాజీ కోప్షన్ సభ్యులు షైక్ ఇబ్రహీం, పూర్ణచందర్ రావు, జయభేరి గోపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, అంజి ముదిరాజ్, కుంట శ్రీనివాస్, మజీద్ కమిటీ అధ్యక్షులు మహ్మద్, సభ్యులు షైక్ ఖాదీర్, సలీం, మైబలి, జహంగీర్, దస్తగిరి మరియు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
