ఎన్టీపీసీ ప్రాంత కార్పొరేటర్లకు, ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అభినందన సన్మానం….
పెద్దపల్లి//ఎన్టీపీసీ: ఈ మధ్య కాలం లో కార్పొరేటర్లు గా విజేత లైన స్థానిక ఎన్టీపీసీ పట్టణ, విశ్రాంత ఉద్యోగులు అధికంగా నివాసం ఉంటున్న కృష్ణ నగర్, అన్నపూర్ణ కాలనీ రామగుండం మున్సిపల్ కార్పొరేటర్లను, ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం బాధ్యులు శుక్రవారం కలిసి అభినందిoచి సన్మానిoచారు.
ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆకుల రాoకిషన్, కార్యదర్శి చెప్యాల శ్రీపతి రావు ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ పట్టణ కార్పొరేటర్ గా ఎన్నికైన, కవిత వెంకట్ రెడ్డి, కృష్ణ నగర్ కార్పొరేటర్ గా ఎన్నికైన స్వప్న ప్రియ- భరత్ గౌడ్, అన్నపూర్ణ కాలనీ నుండి ఎన్నికైన భూలక్ష్మి లింగమూర్తి లను ఘనముగా అభినందించి సన్మానించడమైనది.
ఈ సందర్భంగా అవసరమున్న వారికి రేషన్ కార్డ్స్, పెన్షన్, ఇతర ప్రభుత్వ పథకాలను ఇప్పించటములో సహకరించి, ఈ ప్రాంతమును అభివృద్ధి పరచాలని కార్పొరేటర్ లను కోరడమైనది.
ఈ కార్యక్రమంలో రేవా సీనియర్ నాయకులు తిరుమల సురేందర్ , దుర్గం నర్సయ్య , మంగళంపల్లి రామ్ నారాయణ , డి ఎన్ పోచయ్య, డి లాలయ్య , ఇ .వెంకటేశ్వర్లు, అంబటి సత్యనారాయణ, కొమ్ము గోపాల్, కల్వల రాజమల్లు, ఇతరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
