
రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన,ఇఫ్తార్ విందులో పాల్గొన్న అర్జున్ రెడ్డి
…
నెల్లూరు జిల్లా రంజాన్ మాసం క్రమశిక్షణ, సహనం మరియు సేవా భావానికి నిదర్శనమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయులు డా. అర్జున్ రెడ్డి పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలోని నూరున్ ఫలాక్ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్జున్ రెడ్డి కి స్థానిక మైనారిటీ నాయకులు, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్షను విరమించారు. అనంతరం మసీదులో సేవ చేసే మౌజన్ మరియు విపిఆర్ ఫౌండేషన్ తరఫున రంజాన్ తోఫా కిట్లు అందజేశారు.
ఈ సందర్భంగా అర్జున్ రెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో అందరం కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఉపవాసాల ద్వారా ఆకలి విలువను తెలుసుకుంటూ తోటి వారికి సహాయం చేయాలనే గొప్ప సందేశాన్ని ఈ పండుగ మనకు అందిస్తుందని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరూ ఒకే చోట చేరడం మతసామరస్యం మరియు సోదరభావానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమాలలో ముస్లిం మత పెద్దలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు నాప వెంకటేశ్వర్లు నాయుడు, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, విశ్వం మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
