
అర్హులైన బుడగ జంగాల కుటుంబాలకు నివాస స్థలాలను ఏర్పాటు చేస్తామని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఇంటిలో ఉన్న వీరు ఇటీవల దాకా కైతలాపూర్ 995 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివాసముండేవారు. కాగా గత రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వ అధికారులు ఈ స్థలం ప్రభుత్వాన్ని దాంతో వీరిని ఖాళీ చేయించారు. దీంతో మీరు రోడ్డున పడ్డారు. ఈ విషయమై వారు రమేష్ ని ఆయన కూకట్పల్లి లోని శ్రీ హేమ దుర్గా పార్టీ కార్యాలయంలో కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు .దీంతో స్పందించిన ఆయన స్థానిక ఎమ్మార్వో స్వామికి ఫోన్ చేసి మాట్లాడారు వీరి పరిస్థితిపై చర్చించారు ప్రభుత్వ స్థలం ఎక్కడైనా ఖాళీ ఉంటే వీరి కి అక్కడ చూపించవలసిందిగా సూచించారు. ఈ నాయకులు లక్ష్మయ్య, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, శ్రీను ,రాము, పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
