
గర్భిణి యూట్యూబర్ హత్యపై ఆగ్రహం,
దోషులకు కఠిన శిక్షలు విధించాలి…
-డా.దుర్గం నగేష్….
పెద్దపల్లి .జగిత్యాల జిల్లాలో గర్భిణి యూట్యూబర్ వైష్ణవి హత్య ఘటనపై సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. మార్షల్ దుర్గం నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన సమాజాన్ని కలిచివేసిందని, మహిళలపై జరుగుతున్న హింసకు ఇది దారుణ ఉదాహరణ అని పేర్కొన్నారు.
ప్రేమ వివాహం చేసుకున్న యువతి పై అదనపు కట్నం కోసం వేధింపులు చేసి, చివరకు హత్యకు పాల్పడటం అత్యంత అమానుషమని ఆయన ఖండించారు. గర్భిణి అయిన మహిళను క్రూరంగా హత్య చేయడం మానవత్వానికి మచ్చతెస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. “మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలమవుతోంది. కట్నం పేరుతో జరుగుతున్న వేధింపులు ఇంకా ఆగకపోవడం బాధాకరం. వైష్ణవి హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్షలు విధించాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి న్యాయం చేయాలని ఆయన కోరారు.సమాజంలో మహిళలపై హింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, కట్నం వంటి చెడు సంప్రదాయాలను పూర్తిగా నిర్మూలించాలని డా.నగేష్ పిలుపునిచ్చారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
