
ఆన్యాయాన్ని ఎదిరించడమే భగత్ సింగ్ కు ఇచ్చే నివాళి.
సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్. భగత్ సింగ్, రాజు గురు, సుఖదేవ్ ల 95 వ వర్ధంతి సందర్భంగా నేడు సిపిఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ మరియు భగత్ సింగ్ మార్గ్ లో ఉన్న భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఉమామహేష్ మాట్లాడుతూ నేటి యువత కుల, మత రాజకీయాలను ప్రోత్సహించకుండా భగత్ సింగ్ ఆశించిన సమసమాజ నిర్మాణం కోసం యువత నడుం బిగించాలని, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటే ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజల హక్కులను కాపాడబడతాయని అప్పుడే భగత్సింగ్,రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ లు కోరుకున్నటువంటి సమ సమాజం నిర్మాణం అవుతుందని అదే మనం ఆ వీరులకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ దేశం నుండి తెల్లదొరలు పోయి నల్ల దొరలు రావడమే లక్ష్యం కాకూడదని ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదలన్నీ ప్రజలకే చెందాలని ఎవరు కూడా దోపిడీకి గురి కావద్దని అందరూ సమానత్వంతో బతకాలని కోరుకొని ఆరోజు భగత్ సింగ్ ఈ దేశం కు స్వాతంత్రం కోసం నూనుగు మీసాల వయసులోనే ఉరితాడును ముద్దాడిన గొప్ప విప్లవకారుడు అని అన్నారు.
అలాంటిది నేడు ఎటువంటి త్యాగాలు చేయకుండా బ్రిటిష్ వారి కోసం ప్రజలను ఉద్యోగాల్లోకి చేరాలని పిలుపులించినటువంటి, మత సంస్థలను స్థాపించినటువంటి సావర్కర్ లాంటి వారి ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ దేశ యువతలో స్ఫూర్తినిచ్చినటువంటి కొమరం భీమ్, ఛత్రపతి శివాజీ, అశ్వకుల్లా ఖాన్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరుల చరిత్రలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై మేధావులపై ఉపాధ్యాయులపై ఉందని అందుకు సిద్ధం కావాలని అన్నారు లేకపోతే ప్రజలు మూడత్వంలో మునిగి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయి మరోసారి బానిసలుగా మారే ప్రమాదం ఉన్నదని కావున విప్లవ వీరుల చరిత్రను ప్రజలకు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి కే స్వామి అధ్యక్షత వహించగా సహాయ కార్యదర్శి హరినాథ్ రావు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వి శ్రీనివాస్ ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు శాఖ కార్యదర్శిలు సహదేవరెడ్డి, నరసింహారెడ్డి, రవి యువజన సంఘం నాయకులు మజ్జి గౌరీ, మారెప్ప, సోమయ్య, సామెల్, ఆశప్ప ఇమామ్, బాబు తదితరులు పాల్గొనడం జరిగింది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
