
విశాఖ : రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అక్కయ్యపాలెం సచివాలయ ఉద్యోగి పైలా రాజేష్.
విశాఖ లో అక్కయ్యపాలెం సచివాలయం 125 లలితా నగర్ సచివాయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 80వేలు లంచం తీసుకుంటూ ఉండగా వార్డు ఎడ్యుకేషన్ కం డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్ ను సచివాలయం లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. లలితా నగర్ లో నివాసం ఉంటున్న ద్వారాపురెడ్డి గంగ రాజ్యం అతని కుమారుడు గణేష్ కి రాసిన స్థిరాస్తి సెటిల్ మెంట్ డీడ్ ప్రాసెస్ చేయడానికి 90వేలు లంచం డిమాండ్ చేయగా 80వేలకు ఒప్పందం కుదిరింది.. లంచం ఇవ్వడం ఇష్టం లేని గణేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.. దీనితో రాజేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, కోర్ట్ లో హాజరు పరచనున్నారు.. ఈ దాడుల్లో డి ఎస్ పి లు రమణ మూర్తి, హర్షిత, సి ఐ లు శ్రీనివాస్, వెంకట రావు సిబ్బంది పాల్గొన్నారు.. 1064 టోల్ ఫ్రీ ద్వారా ఏసీబీ నీ సంప్రదించ వచ్చు అని అధికారులు తెలిపారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
