
నూతన మేయర్ మహంకాళి స్వామి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం రేవా సభ్యులు…
పెద్దపల్లి//గోదావరిఖని: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన మహంకాళి స్వామి ని ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం రేవా సభ్యులు వారి కార్యాలయంలో కలిసి అభినందించి సన్మానం చేయడం జరిగింది.
ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆకుల రామ్ కిషన్, ఉప అధ్యక్షులు మంగళంపల్లి రామ్ నారాయణ ఆధ్వర్యములో జరిగిన ఈ కార్యక్రమంలో మహంకాళి స్వామి ” రేవా” చేపట్టి ఎలాంటి సమాజ హిత కార్యక్రమాలకైన తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రేవా సీనియర్ నాయకులు తిరుమల సురేందర్ , డి ఎన్ పోచయ్య, డి లాలయ్య , ఇ .వెంకటేశ్వర్లు, కొమ్ము గోపాల్, ఇతరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
