
బెహన్ అంజలీ ఆర్య రామాయణ కథ
ఆర్య ఈసామి మాబజార్ ఆధ్వర్యంలో 21 వ తారీకు నుండి ప్రారంభం అయిన రామాయణ కథ నాలుగవ రోజు కీ చేరుకుంది.
హర్యానా ప్రాంతానికి చెందిన విదోషి బెహన్ అంజలి ఆర్య రామాయణ కథ చెబుతూ భావితరాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది అని చెప్పారు అంతేకాకుండా సనాతన ధర్మరక్షణకై దేశ రక్షణకై చత్రపతి శివాజీ, భగత్ సింగ్
లాంటి వారిని తయారుచేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని నొక్కి చెప్పారు.
ఈ రామాయణ కథ కార్యక్రమం ఇంకా మూడు రోజులపాటు జరుగుతోంది తేదీ 26 మార్చ్ 2026న సాయంత్రం నాలుగు గంటలకు 300 దంపతులతోని బృహత్ మహా యజ్ఞాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
దాని తర్వాత శ్రీరాముని శోభాయాత్ర చెప్పల్ బజార్ నుండి లింగంపల్లి వీర్ సావర్కర్ స్టాచు హుండా ఆర్య సమాజ్ సుల్తాన్ బజార్ కు చేరుకుని సమాప్తం అవుతుందని ప్రకటనలు తెలిపారు.
ఈ శోభాయాత్రకు హర్యానాకు చెందినటువంటి ఆర్య గారు నేతృత్వం వహిస్తారని తెలిపారు. కాబట్టి భక్తులందరూ ఈ రామాయణ కథ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద సంఖ్యలో ఈ రెండు రోజులపాటు ఉదయం సాయంత్రం జరిగే కథ కార్యక్రమం లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.
ఈ రామాయణ కథా కార్యక్రమంలో శ్రీ విజయపాల్ ఆర్య, అశ్విన్ యాదవ్, ధర్మపాల్ ఆర్య, డాక్టర్ ధర్మతేజ్, యశ్పాల్, అభినవ్, అజయ్పాల్, మల్లిక, దయానంద్, రాణి లక్ష్మీ బాయి, నరేందర్ ఆర్య, పృథ్వీ(KP) తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
