
నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం….
నియోజకవర్గంలో 3500 మందికి ఇందిరమ్మ ఇల్లు…
400 మందికి పిల్ల స్థలాల మంజూరు…
మిగిలిన వారికి వైయస్సార్ ఇళ్లపట్టాలిస్తాం…
అసెంబ్లీలో రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అసెంబ్లీ సమావేశాలలో స్పష్టీకరణ..
రామగుండం నియోజకవర్గంలో నిరుపేదలను గుర్తించి 3500 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించారు.
అలాగే 400 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, వారికి ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు ఇస్తామన్నారు. అయితే గత ప్రభుత్వం 10 ఏళ్లలో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాల పేరిట అనవసరపు ఖర్చులు చేసిందని, వాటిని నిరుపయోగంగా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా 53 మంది ట్రాన్స్ జెండర్స్ కు ఇళ్లపట్టాలిచ్చామని పేర్కొన్నారు.
అదేవిధంగా వారికి ఇప్పటికే వివిధ విభాగాలలో ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో సింగరేణి ప్రాంతంలో జెన్కో, సింగరేణి భూములలో ఇల్లు కట్టుకున్న వారికి వైఎస్ఆర్ పట్టాలు 18,000 వరకు ఇచ్చామని గుర్తు చేశారు.
అదేవిధంగా మరో 7 వేల మందికి ఇచ్చేది ఉందని గుర్తు చేశారు. ఇంకా 11 వేల మంది నిరుపేదలను గుర్తించామని, వారికి ఖాళీ స్థలాలలో ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇందిరమ్మ కాలనీగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
