
పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ పేరుతో ఇబ్బందులు కల్గకుండా చూడాలి…
అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించిన రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్ రాజ్ ఠాకూర్….
పెద్దపల్లి// రామగుండం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత 50 ఏళ్ల నుంచి కూలీలుగా పనిచేస్తున్న ఒరిస్సా, ఛత్తీస్ గడ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన నిరుపేదలు ఇక్కడి పరిశ్రమలలో ఏళ్ల తరబడి పని చేస్తున్నారని, వారిని గుర్తించి కులం సర్టిఫికెట్లు ఇవ్వడం ద్వారా సంక్షేమ పథకాలు ఇచ్చే వీలుంటుందని అన్నారు.
అంతే కాకుండా ఆ కుటుంబాలలో ఉన్న పిల్లలు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంటుందని, అలాగే ఎన్టీపీసీ పరిశ్రమలోని వివిధ విభాగాలలో వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
అయితే వారికి పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ పేరుతో 1500 వసూలు చేస్తూ నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వర్కర్స్ విషయంలో అధికారులు దృష్టి సారించాలన్నారు. వారికి నార్మల్ రుసుము చెల్లించే వీలుగా అవకాశం కల్పించాలన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
