
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 2BHK (డబల్ బెడ్ రూమ్) లలో వాటర్ ట్యాంక్ నిర్వహణ కాంట్రాక్ట్ ముగిసినందున, అలాగే ప్రస్తుతం నీటి కొరత ఉండటంతో పాటు వచ్చే రోజులు ఎండాకాలం కావడంతో సమస్య మరింత తీవ్రమవుతుందని భావించిన డబుల్ బెడ్ రూమ్ వాసులు, ఈరోజు బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.
ఈ విషయంపై స్పందించిన కొలన్ హన్మంత్ రెడ్డి , సమస్యను సానుకూలంగా పరిగణించి సదురు కమిషనర్ తో మాట్లాడి యధావిధిగా కొనసాగించేలా పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్, అధ్యక్షులు శ్రీలత దేవకుమార్ గూడపాటి, ముస్తఫా మెహరాజ్ బేగం, సీనయ్య, ఎండి సలీం ఫాతిమా, శ్రీలత సంజయ్, రాణి శశికళ, సుమిత్ర, శ్రీనివాస్ చారి, పి. శ్రీను, ఇమాద్, మొయిన్ భాయ్, వడినా కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
