ఉదయగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన….

ఉదయగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన

తిరుపతి / నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. వింజమూరు ఎస్సీ కాలనీలో లబ్ధిదారు యరగొర్ల బాలమ్మ ఇంటికి వెళ్లి వితంతు పింఛను అందించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. తన చిన్న కుమారుడు బాలరాజు కాలేయ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని బాలమ్మ సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

బాలరాజుకు ప్రభుత్వం తరఫున వైద్యం అందిస్తామని బాలమ్మ కుటుంబానికి సీఎం భరోసా ఇచ్చారు. మంచి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండి రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకుందామని కోరారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకుని వైసీపీ తప్పుడు ప్రచారం మాటలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top