
100 పడకల హాస్పిటల్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు ..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో నిర్మించనున్న 100 పడకల హాస్పిటల్‌కు కేటాయించిన దేవాదాయ శాఖ భూమిని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్ నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే , వీలైనంత త్వరగా భూమికి బౌండరీలు ఏర్పాటు చేయాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు సూచించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ…
వర్ధన్నపేట ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 100 పడకల ఆధునిక హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పట్టణ ప్రజలకు సమీపంలోనే అన్ని సౌకర్యాలతో కూడిన ఆసుపత్రి అందుబాటులోకి వస్తే పేద ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అన్నారు. ఈ హాస్పిటల్ నిర్మాణం ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గంలోని వేలాది మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు లభిస్తాయని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చికిత్స అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దేవాదాయ శాఖ భూమిని హాస్పిటల్ నిర్మాణానికి కేటాయించినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. త్వరలోనే హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు వేగవంతం చేస్తామని తెలిపారు…
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ శిభారాణి రాజేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, కౌన్సిలర్లు పాపారావు, కమిలిఖీమానాయక్, దేవేందర్, వాణి కుమారస్వామి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తుల్లా రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోశాల వెంకన్న, నాయకులు రామకృష్ణ, మహేందర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
