
అరైవ్ అలైవ్”లో భాగంగా మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ కార్యక్రమం అమలు….
పెద్దపల్లి//రామగుండం: రోడ్డు భద్రతను పెంపొందించేందుకు, హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం లో భాగంగా మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ కార్యక్రమం నిర్వహించబడింది.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఈ కార్యక్రమాన్ని అమలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. డీసీపీ కార్యాలయానికి, మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో పనిచేసే సిబ్బంది హెల్మెట్ లేకుండా వస్తే ఆవరణలోకి అనుమతించబడరని స్పష్టం చేశారు.
హెల్మెట్ వినియోగం కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా, వ్యక్తిగత భద్రతకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా హెల్మెట్ వినియోగంపై కఠిన నియంత్రణలు అమలు చేస్తూ, ప్రజల్లో రోడ్డు భద్రతపై బాధ్యతాయుత దృక్పథం పెంపొందించడం లక్ష్యంగా పోలీస్ శాఖ చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని అధికారుల పిలుపునిచ్చారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
