
అక్షయ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు…
అక్షయ ఐఐటి ఫౌండేషన్ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలోని నయా నగర్ గల పాఠశాల కరస్పాండెంట్ బోడ్ల లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా కోదాడ ఎంఈఓ సలీమ్ షరీఫ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ షేక్ వీరబాబు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పాఠశాలలో సంప్రదాయ,ఆధునిక నృత్యాలతో విద్యార్థులు ఆకట్టుకోవడమే కాకుండా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల అకాడమిక్ మార్కుల ఆధారంగా ఐఐటి అకాడమిక్ మార్కులతో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులను ఎంఈఓ సలీం షరీఫ్ అభినందించి వారి చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేసి ఆయన మాట్లాడుతూ. ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థులలో క్రమశిక్షణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి కృషి తో పాటు అకాడమిక్స్ తో పాటు సహ పాఠ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులలో సర్వతో ముఖాభివృద్ధికి పాఠశాల గురించి చేస్తున్నటువంటి కృషి పట్ల నిర్వాహకులను పాఠశాల యజమాన్యాన్ని ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఆహ్లాదకర వాతావరణంలో అన్ని హంగులతో పిల్లల ఎదుగుదల తన ఎదుగుదలగా భావించి ఎలాంటి ఖర్చులకు వెనకాడకుండా పిల్లల సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడుతున్న పాఠశాల యజమాన్యం, పాఠశాల ఇంచార్జ్ వీరబాబు, ప్రిన్సిపాల్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బోడ్ల లక్ష్మీ నరసింహారావు,ఇంచార్జ్ షేక్ వీరబాబు, ఉపాధ్యాయులు ఫాతిమా, శిరీష, మౌనిక, శ్రీనిధి, నిరోషా, లక్ష్మి, కవిత, కళ్యాణి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లితండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
