
కోయంబత్తూరులో ఏపీ ముఖ్యమంత్రి
తిరుపతి / కోయంబత్తూరు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రముఖ వాణిజ్య నగరంగా అభివృద్ధి చెందిన కోయంబత్తూరులో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అభ్యర్థుల తరపున చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారానికి హాజరైన ముఖ్యమంత్రి… కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్ లతో కలసి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అలాగే కోయంబత్తూరులో స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించి సుపరిపాలన, స్వేచ్చా పాలన కావాలంటే ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా “శాప్” చైర్మన్ అనిమిని రవినాయుడు, టీడీపీ లీగల్ సెల్ నేత దినకర రాయల్ తదితరులు కూడా పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
