
జనసేన జిల్లా అధ్యక్షుని జన్మదిన వేడుక
తిరుపతి: జనసేన పార్టీ
ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు అండ్ రాష్ట్ర హస్తకళల నైపుణ్య కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జన్మదిన వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఆయనకు తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు సుమన్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి, “గీతం” మునస్వామితో పాటు చంద్రగిరి, నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ
డాక్టర్ హరిసార్ నాయకత్వం, సేవాభావం, ప్రజల పట్ల అంకితభావం ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తిదాయకం. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటూ, మీ భవిష్యత్ కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నామని విషెష్ చెప్పారు. ఎర్రావారిపాలెం మండల అధ్యక్షులు
ముండ్లపాటి మురళీ మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ ఏడుకొండల దేవుణ్ణి కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
