
కోటిలింగాల దేవాలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం – పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ వంశీకృష్ణ…
పెద్దపల్లి// . వెలగటూరు మండలం కోటిలింగాలలోని శ్రీ కోటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎంపీ కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు.
రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, శాంతి సమృద్ధి కలగాలని ఎంపీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేదమంత్రాల మధ్య అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
