
ఏప్రిల్ 25న భారీ జాబ్ మేళా – మెడ్ ప్లస్‌లో 110 ఉద్యోగాలకు అవకాశం….
పెద్దపల్లి//
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ నెల 25న. జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఈ జాబ్ మేళా పెద్దపల్లి నూతన కలెక్టర్ భవన సముదాయంలోని జిల్లా ఉపాధి కార్యాలయం (రూమ్ నెంబర్ 233)లో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రముఖ మెడ్ ప్లస్ కంపెనీలో మొత్తం 110 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:
ఫార్మాసిస్టులు – 40
ఆడిట్ అసిస్టెంట్లు – 50
సెక్యూరిటీ గార్డులు – 20
అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలతో హాజరై, ప్రదేశంలోనే నమోదు చేసుకోవాలని సూచించారు. మొదటి అంతస్తులోని కార్యాలయంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మరిన్ని వివరాల కోసం 8985336947, 8121262441 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని జిల్లా ఉపాధి అధికారి పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
